ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబుతో ఆట‌!

లండ‌న్‌: కొన్నిసార్లు అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి అంటే ఇదేనేమో... త‌నకు దొరికింది బాంబు అని తెలీక దానితోనే ఆట‌లాడాల‌నుకుందో మహిళ‌. స‌మ‌యానికి ఫేస్‌బుక్ యూజ‌ర్లు నిజం చెప్పారు కాబ‌ట్టి బ‌తికిపోయింది. లేకుంటే ఎంత పెద్ద‌ ప్ర‌మాదం జ‌రిగి ఉండేదో ఊహించ‌డానికే భ‌యంక‌రంగా ఉంది. ఇంగ్లండ్‌లోని వేమౌత్‌కు చెందిన లూలూ సిరిల్లో అనే మ‌హిళ త‌న‌ గార్డెన్‌లో ప‌నులు చేస్తుండ‌గా బుర‌ద‌‌లో కూరుకుపోయి ఉన్న ఓ వ‌స్తువును గుర్తించింది. ప‌ది ఇంచుల పొడ‌వున్న దాన్ని రెండో ప్ర‌పంచ యుద్ధం నాటి బాంబుగా గుర్తించలేక‌పోయింది. అదేదో ఆట వ‌స్తువు అనుకున్న ఆమె.. దాన్ని కిచెన్‌లోకి తీసుకెళ్లి తీరిక‌గా శుభ్రం చేసి పెట్టింది. అనంత‌రం దాన్ని పెంపుడు జంతువు ఆడుకునేందుకు ఇచ్చింది. (మోదీ ఫస్ట్‌... ట్రంప్‌ సెకండ్‌)