కొత్త 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్లు అమర్చుతున్నారు. మొత్తం 400 పైగా వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 104 వాహనాలను ఏఎల్‌ఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ లైప్‌ సపోర్ట్‌) వాహనాలుగా మార్చుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బాధితులను రకక్షించడంలో భాగంగా ఈ వాహనాలు పనిచేస్తాయి. వీటి కోసం అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ‘రెస్‌మెడ్‌​’ నుంచి కొనుగోలు చేసిన మొబైల్‌ వెంటిలేటర్లను అమర్చుతున్నారు. 104 వాహనాల్లోనూ వెంటిలేటర్‌తో పాటు డిఫ్రిబ్యులేటర్‌(గుండె సంబంధిత ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడే యంత్రం), పల్సాక్సీ మీటర్‌(రక్తంలో ఆక్సిజన్‌ శాతం నియంత్రణ) వంటి అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. ఇవన్నీ అమర్చి ఈ నెలలో వీటిని వినియోగించేందుకు సమాయత్తం చేస్తున్నారు. (కరోనాపై పోరు; మరో మైలురాయి)